క్రైస్తవ బోధలు...... రకాలు

🔥 *బోధలు* ... *రకాలు* 🔥

నేటి కాలంలో సంఘాలలో ఎన్ని రకాల బోధలు ఉన్నవి

❓❓❓❓❓❓❓

❌ *అల్లరి బోధ:* 
ఎగరడం..కేకలు పెట్టడం, గెంతులెయడం.

❌ *చిల్లర బోధ:*
డబ్బు కోసం టీవీలలో ఏడవడం, స్పాన్సర్షిప్ కోసం గోల చేస్తూ, హడలెత్తే పబ్లిసిటీ చేయడం.

❌ *తెలివి తక్కువ బోధ:* 
ప్రజలకు వాక్యం నేర్పడం చేతగాక, ఆచారాలు ఈ లోక పద్ధతులు నేర్పడం

❌ *అతి భక్తి బోధ:* 
దేవుని వాక్యాన్ని మరిపించి 
తన భక్తిని చూపించలని, ప్రతిసారి ఉపవాసం, ప్రతిసారి నా త్యాగం 
అంటూ ఉదర గొట్టడం

❌ *నీతిలేని బోధ:* 
ఇష్టానుసారంగా తిరుగుతూ పాపాన్ని ఖండించలేక బోదతో 
నీతి నేర్పలేక సంఘాలపై 
అవినీతిని రుద్దడం

❌ *సమర్దించుకునే బోధ:*
 మన దేశీయ పద్ధతులతో బ్రతకాలి
అందుకు మనం ఈ లోకంలో ఉన్నాం గనుక అన్ని చేయాలి అని సంఘాన్ని భ్రష్టు పట్టిస్తు చేసే బోధ

❌ *రుచి లేని బోధ:* 
పస లేని ప్రసంగాలు, అంశంపై పట్టులేక దారం తెగిన గాలిపటం వలే ఎలా ముగించాలో తెలియక తన సోది చెపుతూ వినువారికి 
తలనొప్పి తెప్పించడం

❌ *సొంత డబ్బాల బోధ:* 
నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వదిలినాయి
నేను పాట పాడితే రోగాలు పోయాయి.. 
ఇది డబ్బా రేకుల బోధ

❌ *మిక్సింగ్ చేస్తూ గొప్ప చేసుకునే బోధ:*  
కొంత ఇంగ్లీష్ మరికొంత మాతృ భాషతో ప్రసంగాలు ఉపేస్తూ,
గొప్ప స్పీకర్స్ అని 
పాన్స్ పాలోయింగ్ పెంచుకుంటారు..
వినే వాడు వెర్రోడైతే కోడి గుడ్డుపై ఈకలు పికిస్తారు
ఈ మిక్సింగ్ బోధకులు

❌ *కల్పిత బోధ:* 
వాక్యానికి విరోదంగా ప్రజలను దురద చెవులు గలవారిగా తయారు చేసేది వీరి బోదలే.. 
సినిమా సీరియల్స్ వలే అత్త, కోడళ్లు, మామా అల్లుళ్ళ గురించి కామెడీ చేస్తూ
అసలు దైవ వాక్యం ఆంటే వేగటుగా చేసే బోదలే ఈ కల్పిత బోధలు.

❌ *పితృ పారంపర్య బోధలు:* చెట్టు చూపించి కాయలు కోసుకునే రకాలు వీరు..
పితృ మహామహులకు ప్రణమములు అంటూ వారి ఆత్మీయ తండ్రుల,
నాయకుల ఫొటోలు పెట్టుకొని ప్రభువు ను చూపించలేక 

నా నాయకుడు బ్రతికుండగా 
తుమ్మితే ముత్యాలు వచ్చాయి.
నడిస్తే బంగారం వచ్చింది అంటూ 
నేటి వారి సంఘాలలో దేవుని కన్నా వారి ఆత్మీయ నాయకులను గొప్ప చేస్తూ, మందిరాలలో ఫొటోస్ పెడుతూ మహిమ పరుస్తున్నారు.

❌ *కాపీ కొట్టే బోధలు:* 
స్వతహాగా బైబిల్ జ్ఞానం తెలియక ఎవరో ఒకరు చేసిన బోధలు చేస్తూ..
తప్పుడు సిద్ధాంతాలను నేర్పుస్తున్నారు...

✔️👌 *అపోస్తలుల బోధ:*  ✊

కనులారా ఏది చూసారో వారి చెవులతో ఇది విన్నారో అది వివరించుటకు బయపడక ప్రజలను నోప్పించి అయినా సరే 
క్రీస్తువాక్యంను ఒప్పిస్తారు..
ఈ బోదలో *రాజీ* ఉండదు
ఎవరో కొడతారనో
చంపుతారని 
*భయం* అసలు ఉండదు

మరి మీరు ❓❓❓

ఏ బోదలో ఉన్నారో 
ఎలాంటి బోదకుణ్ణి కలిగి ఉన్నారో వివేచించు కొనండి..❗❗❗

సత్యమును గ్రహించండి 
అప్పుడు సత్యమును మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది..

అబద్ద బోదల సంకెళ్ళ నుండి విడిపించబడి నిత్యరాజ్య పయనంలో అజ్ఞానుల వలె గాక *జ్ఞానుల* వలె ఉందుము గాక!!  

*ఆమేన్! ఆమేన్!! ఆమేన్!!!*
💓  💓 💓

Comments

Popular posts from this blog

Graham stains life story telugu

తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడా? -పెద్ద కుమారుడా?*