Jesus Christ &church

 


🔥 *బాబోయ్!! ఇక నుండి నేను ఈ చర్చికి వెళ్లను.!!!* 🔥 



ఎం#పాస్టర్_గారు.......


👉 *ప్రతీ సారి పరిశుద్ధత గురించి నొక్కి చెబుతాడు. పరిశుద్ధముగా ఉండాలి అంటాడు.* ౼ *__అది మా వ్యక్తిగతం కదా.!_*


👉 *రోజుకు కనీసం ఒక గంటైన ప్రార్ధించాలి అంటాడు.* ౼ *__అస్సలు మాకు ఎక్కడ ఉంది సమయం.?_*


👉 *రోజు బైబిల్ చదవాలంట.* ౼ *__అస్సలు అది జరిగే పనియేనా.? నాకు సీరియల్స్ / సినిమాలు చూడటానికి సమయం సరిపోక మా ఆయన నా పనిలో సహకరిస్తారు._*


👉 *నియామక కూడికలకు (శనివారం విజ్ఞాపన కూడిక , స్త్రీల కూడిక, పురుషుల కూడిక, యవ్వనస్థుల కూడిక )  రావాలంట.* ౼  *__అస్సలు ఆదివారం రావడమే కష్టమంటే ఇవి ఒకటి._* 


👉 *మందిరంలో పరిచర్య చేయాలంట.* ౼ *__ఇంట్లోనే మా పని చేసుకోవడానికి తీరిక లేదంటే ఇది ఒకటి._*


👉 *దైవసేవకుల మాట వినాలంట.* ౼ *__అస్సలు దేవుని మాటే వినడం లేదంటే ఇది ఒకటి(వాక్యానికి లోబడటం)._*


👉 *పొరుగువాళ్లను ప్రేమించాలట మరియు సహాయం చేయాలట.* ౼ *__మమ్ములను కన్న మా ముసలి అమ్మా నాన్నాలకే దిక్కులేదు._*, *_వాళ్లనే నెలకు ఒకరి చొప్పున మా  అన్న తమ్ముళ్ళం పంచుకుంటే._*


👉 *అనాధలకు, విధవర్రాళ్లకు సహాయం చేయాలంట. మా సంఘం ద్వారా నడపబడుతున్న దానికే చేయాలంట.* ౼ *__అస్సలు ఇది జరిగే పనేనా. మా పిల్లల కార్పొరేట్ చదువులకు దాచొద్ద డబ్బులు._* 


👉 *సమయానికి రావాలంట.* *_ఏమండీ సమయానికి వస్తే మాకు ఏదో కిరీటమో లేక బహుమతి ఇచ్చినట్లు._* *__అస్సలు గుడికి పోవడమే కష్టమంటే ఇది ఒకటి. ఏదో వచ్చిండ్రు పోయిండ్రు అనుకోవొచ్చుగా._* *__ఆశీర్వాదము ఇచ్చే సమయముకు వెళ్లి , హాజరు పడ్డదా లేదా, అని మేము అనుకుంటుంటే ఇది ఒకటి._* 


👉 *కన్వెన్షన్స్ అంటాడు, కానుకలు ఇవ్వమంటాడు.* ౼ *__ఏమండీ సెలవులో మా కుంటుంబముతో సరదాగా గడుపుదాము అనుకుంటే ఆ మూడు రోజులు బుక్ అయినట్లే. అన్ని కూడికల్లో పాల్గొనాలట. ఆదివారమే ఆ మూడు గంటలు ఎలా తప్పించుకోవాలబ్బా అనుకుంటుంటే ఇదొకటి._*


👉 *డైరీలు, క్యాలెండర్లు, క్రైస్తవ సాహిత్యం (భక్తుల జీవిత చరిత్రలు) కొనమంటాడు.*  ౼ *__నా బైబిల్ కొని 10 సంవత్సరాలు అయింది. ఇంకా కొత్తగా ఉంది. ఇంకా ఇవి కొని ఏం చేసుకోను._*


👉 *యేసు క్రీస్తు త్వరగా వస్తున్నాడు(రెండవ రాకడ) సిద్ధపడండి, లేకపోతే విడవబడుతారు అంటాడు.* ౼ *__మేము విడవబడుతే ఆయనకు ఎందుకండి? ఆయనకు ఏమన్నా కలిసి వస్తుందా.?_* 


👉 *నీతిమంతుని ( దైవసేవకులు ) గద్ధింపు తైలాభిషేకం  అంటాడు.* ౼ *__అసలు నన్ను మా ఆయన అంటేనే ఊర్కోను. ఎవరు ఏమన్నా పడను. అది నా తత్వం._* 


👉 *వాక్యము చెప్పుటలో రాజీ పడడట, మొమాటం లేదట, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి దేవుడే అధికారం ఇచ్చాడట.* ౼ *__మనుషుల మెప్పు వద్దట , కోరడట. క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలట. ఏమి పాస్టర్ రా బాబు._* 


👉 *బొట్టు పెట్టొద్దట, రాఖీ కట్టొద్దట, జాతర వెళ్ళొదట, తయ్యత్తు కట్టొద్దట, వాస్తు చూడొద్దట, తోరణాలు కట్టొద్దట, నవరాళ్లు, నవ ధాన్యాలు వాడొద్దట.* ౼ *__మా తాత ముత్తాత దగ్గరనుండి వస్తున్నాయి వొద్దంటే ఎలా.?_*


👉 *కులం చూడొద్దట, ఆచారాలు పాటించొద్దట, దశదిన కర్మలు,  దినాలు చేయోద్దట. ముహుర్తాలు చూడొద్దట. తిధి, నక్షత్రం , పేరు బలం చూడొద్దట. మంచి రోజులు, చెడ్డ రోజులు లేవట.* ౼ *__నేనేమో తుమ్మిన, దగ్గిన, పిల్లి ఎదురొచ్చినా, ఆగిపోయే వ్యక్తిత్వం._* 


🙏 *అమ్మో, ఇక మా వల్ల కాదండి.!!!* 🙏


◆ *ప్రస్తుతం మేము వెళ్తున్న ఈ పాస్టర్ పద్ధతులు అస్సలు నచ్చడం లేదు.!* 


● *__మేము ఏమి చేసినా, ఎప్పుడు వెళ్లినా, మమ్ములను పట్టించుకోకుండా ఉండే పాస్టర్లు, చర్చిలు కావాలి, అలాంటివి మా ఊరిలో బోలెడన్ని. వచ్చారా, వెళ్ళారా అనుకునే సంఘాలు ఎన్నో.  ఇక ఆ సంఘాలకే వెళ్లాలని నిర్ణయించుకున్నాము._* 


● *__మాకు స్వేచ్చా స్వాతంత్రము దొరికే సంఘాలు కావాలి. మేము ఎన్ని తప్పులు చేసినా ఖండించని , గద్దించని పాస్టర్ కావాలి._*  


● *__మేము నరకము వెళ్లినా పర్వాలేదు. మేము నరకానికి వెళ్తాము అని కూడ మాకు తెలుసు. మా జీవితం మా ఇష్టం._*

Comments

Popular posts from this blog

Graham stains life story telugu

తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడా? -పెద్ద కుమారుడా?*