To day Christianity





*★దేవుని సేవలో నాడు ౼ నేడు★*
    
1. సేవలో త్యాగం,తెగింపు,వైరాగ్యం ౼ *నాడు*
   సేవలో ఆర్భాటం,ఆడంబరం,ఆదాయం ౼ 
   *నేడు*

2. సేవలో దెబ్బలు,బొబ్బలు  ౼ *నాడు*
    సేవలో డబ్బులు,జబ్బులు ౼ *నేడు*

3. సేవలో ఆకాశమందలి దేవుడే.... ౼ *నాడు*
    సేవలో ఆకాశహర్మ్యాలు ౼ *నేడు*  

4. సేవలో సమస్తమును విడిచిపెట్టి... ౼
    *నాడు*
    సేవలో సమస్తమైన లౌక్యం,సౌఖ్యం   ౼ 
    *నేడు*

5. సేవలో భారము,బాధ్యత  ౼ *నాడు*
    సేవలో బడాయి, లాడాయి ౼ *నేడు*


6. సంఘాలు దేవునివి ౼ *నాడు* 
    సంఘాలు నావి  ౼ *నేడు*

7. సంఘంలో ఏకమనస్సు, ఎడతెగక ౼  
     *నాడు*
    సంఘంలో ఎవరికివారే,యమునాతీరే ౼
     *నేడు*

8. సంఘాలు కట్టారు అందరూ కష్టపడి ౼ 
    *నాడు*
    సంఘ భవనాలు కడుతున్నారు ఎందర్నో 
    కష్టపెట్టి ౼ *నేడు*

9. పొలాలు తెల్లబారి కోతకొచ్చాయి  ౼ *నాడు*
    అరుపులు బొబ్బలేగాని కల్లంలో గింజల్లేవు 
     ౼ *నేడు*

10. యేసును గూర్చిన సహనము ౼ *నాడు*
      పొగడ్తలు,ప్రోటోకాల్               ౼ *నేడు*

11. మనమందరం ఒకే శరీరం ౼ *నాడు*
      మనోడేనా..? వాడుకోవచ్చా…? ౼ *నేడు*

12. మీరు ఎవరు 'క్రీస్తు వారు' ౼ *నాడు*
      మీరు ఎవరు 'ఫలానా' ౼ *నేడు*

13. సముద్రంలో వలలు వెయ్యటం ౼ *నాడు*
      బుట్టలో గాలం వెయ్యటం ౼ *నేడు*

14. లేఖనాల్లో వ్రాసినట్టు ౼ *నాడు*
      బుర్రకు తోచినట్టు ౼ *నేడు*

15. క్రీస్తుత్యాగం,సిలువ సువార్త ౼ *నాడు*
      క్రీస్తు ఒక కమర్షియల్ కమోడిటి ౼ *నేడు*

16. మరణం వరకు నమ్మకం  ౼ *నాడు*
      నమ్మకానికే మరణం ౼ *నేడు*

Comments

Popular posts from this blog

Graham stains life story telugu

తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడా? -పెద్ద కుమారుడా?*