John Everett Clough ongole

[జాన్ ఎవరెట్ క్లౌ (జూలై 16 1836-నవంబర్ 26 1910) తెలుగునాట పేరొందిన క్రైస్తవ సేవకుడు. అమెరికాకు చెందిన జాన్ క్లౌ భారతదేశానికి క్రైస్తవ పాస్టర్ గా వచ్చి ఒంగోలులో బాప్తిస్ట్ మిషన్ని నడిపించారు. 1876-78 మధ్యకాలంలో వచ్చిన తీవ్రమైన కరువులో ఆనాటి సమాజంలో అట్టడుగున జీవిస్తున్న కులస్తులకు పనికల్పించి, ఆహారం అందించి కాపాడారు

జననంజాన్ ఎవరెట్ క్లౌ
జూలై 16 1836
న్యూయార్కు దగ్గరలోని ఫ్రెస్‌బర్గ్‌మరణం1910 నవంబరు 24 (వయసు 74)
అమెరికావృత్తి - పాస్టర్, సేవకుడు.
  • కుటుంబ నేపథ్యం:

జాన్ క్లౌ అమెరికాలోని న్యూయార్కు దగ్గరలోని ఫ్రెస్‌బర్గ్‌లో 1836లో వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించారు. వారి కుటుంబం ఐయోవా ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల పనులు చేశారు. వ్యవసాయం, సర్వేపనులు చేసుకుంటూనే చదువుకుని అప్పర్ ఐయోవా యూనివర్శిటీ ఆఫ్ ఫయెట్టే నుంచి 1862లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నారు. ఆయన మొదటి భార్య హారియట్. 1893లో ఆమె మరణించాక 1894లో మరో మతప్రచారకురాలైన ఎమ్మా రొషాంబుని వివాహం చేసుకున్నారు. ఎమ్మా రొషాంబు మతప్రచారకురాలు, విదుషి. ఆమె బెర్న్ విశ్వవిద్యాలయంలో పీహెచ్.డి. పూర్తిచేశారు. ఆమె పరిశోధక కృషికి గుర్తింపుగా రాయల్ ఏషియాటిక్ సొసైటీలో సభ్యత్వం పొందారు.


  • భారతదేశ ఆగమనం

అమెరికా, కెనడాకు చెందిన మతబోధకులతో ప్రారంభించిన లోన్ స్టార్ మిషనరీ ద్వారా భారతదేశానికి వచ్చారు. 1840ల్లో ప్రారంభమైన ఈ మిషన్‌ని మూసివేసేందుకు 20 ఏళ్ళ కాలంలో మూడుసార్లు ప్రతిపాదనలు జరిగాయి. అయితే చివరిసారి 1862లో ప్రతిపాదింపబడింది. ఈ మిషన్లో పనిచేసేందుకు క్లౌ దంపతులు 1864 నవంబరులో బోస్టన్ ఓడరేవులో బయలుదేరి 1865 ఏప్రిల్ 22 న నెల్లూరు చేరుకున్నారు. ఆయనను ఒంగోలు కేంద్రంగా దేవుని యేసు క్రీస్తు ప్రభు వారి బైబెల్ వాక్యాలద్వారా రక్షణ మార్గములోకి చేసేందుకు నియమించారు.
 క్రైస్తవుడి గా మారిన తన బంధువు ద్వారా క్రైస్తవాన్ని గురించి తెలుసుకున్న పేరయ్య రక్షణ మార్గములోకి వచ్చాడు. పేరయ్య సువార్త ద్వారా వందలమంది క్రీస్తును నమ్మడం ప్రారంభించడంతో తర్వాతి ఏడాది జనవరిలో వారిని సందర్శించి బాప్తిజం ఇచ్చారు.


  • కరువులో సేవ:

1876-78 కాలంలో కోస్తాంధ్ర ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కరువు కాలంలో క్లౌ చేసిన సేవలు పేర్కొనదగినవి. 1876లోనే కరవు జాడలు పసిగట్టి ఆంగ్లేయ ప్రభుత్వం ప్రారంభించిన బకింగ్ హాం కాలువ పనులలో 3 మైళ్ళ పనికి కాంట్రాక్టు ప్రయత్నించి పొందారు. రాజుపాలెం అనే గ్రామం వద్ద సహాయ శిబిరాన్ని ఏర్పాటుచేసి "అన్నం పెట్టించి, కూలీ ఇస్తానని" బోధకులతో గ్రామాల్లో చెప్పించారు.

 వారిని అనుసరించి అనూహ్యమైన సంఖ్యలో అన్నార్తులు వచ్చారు. వేలాదిమంది బీదసాదలు ఆ శిబిరానికి నకనకలాడుతూ చేరుకుని అప్పటికి ఉడకని అన్నమే తిని మరణించినవారూ, చేరుకుంటూనే తట్టుకోలేక మరణించినవారూ, రేపు తినగలమో లేదోనని తినీ తినీ చనిపోయినవారూ ఇలా వేలకొద్దీ శవాలు పేరుకునేవి. వాటిని తీయించి శుభ్రం చేయించి ఉన్నవారిని బతికించుకునేందుకు ప్రయత్నాలు చేసేవారు. వేలాదిమంది కూలీలను, అట్టడుగు వర్గాలకు చెందినవారినీ వారు పనులతో బతికించారు.
ఈ రోజు ఒంగోలు లో కైస్తవులు అతి ధనవంతులు కావడానికి కారణం యేసు దేవుడు , దొరగారు
pastor.varaprasad 

Comments

Popular posts from this blog

Graham stains life story telugu

తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడా? -పెద్ద కుమారుడా?*