Caleb faithful servant




💮 *కాలేబు విశ్వాసము* 💮

*కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళపరచి మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.* సంఖ్యా 13:30

వాగ్ధాన భూమిని స్వతంత్రించు కొనుటకుగాను, ఆ దేశ పరిస్థితులు తెలిసుకొనుటకుగాను, పండ్రెండు గోత్రములలో నుండి, పండ్రెండుగురిని మోషే కనానుకు పంపించాడు. 

వారిలో కాలేబు, యెహోషువా తప్ప మిగిలిన పది మంది తెచ్చిన సమాచారం ఏమిటంటే? 

🔸అది పాలు తేనెలు ప్రవ హించు దేశమే
🔸ఆ దేశములో నివసించు 
జనులు బలవంతులు; 
మనము వారితో యుద్ధం చెయ్యలేము. 
🔸వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి.
🔸మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము.
🔸మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు.
🔸మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి.


♻ *అయితే, వారిలో కాలేబు, యెహోషువా తెచ్చిన సమాచారం ఏమిటంటే?*

🔸మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము.
🔸అది పాలు తేనెలు ప్రవహించుదేశము.
🔸యెహోవా మనయందు ఆనం దించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును
🔸యెహోవా మనకు తోడైయున్నాడు. గనుక, వారికి భయపడవలసిన పనిలేదు. 
🔸దాని జయించుటకు మన శక్తి చాలును.


♻ *ఎందుకు? వారికి, వీరికి మధ్య ఇంత వ్యత్యాసము?*

🔸వారు ఉన్నత దేహులను చూస్తున్నారు. 
🔸వీరు ఉన్నత దేవుని చూస్తున్నారు. 

🔸వారు బలవంతులైన మనుష్యులను చూస్తున్నారు. 
🔸వీరు బలవంతుడైన దేవునిని చూస్తున్నారు. 

🔸వారు సమస్యను చూస్తున్నారు. 
🔸వీరు సమస్యను పరిష్కరించగల దేవునిని చూస్తున్నారు. 

🔸వారు ఆ దేశ ప్రాకారాలను చూస్తున్నారు. 
🔸వీరు దేవునినే ప్రాకారముగా కలిగియున్నారు. 

🔸వారు మిడతలము ఆనుకొని వారిని వారు బలహీన పరచుకొంటున్నారు.
🔸వీరు మిడతల దండుచే ఐగుప్తీయులను భయపెట్టిన దేవుని బలాన్నిచూచి, బలాన్ని పొందుకొంటున్నారు. 

🔸అక్కడనున్న భయంకరమైన పరిస్థితులు తప్ప, వారికేమి కనిపించట్లేదు. 
🔸దేవుని వాగ్దానం తప్ప వీరికేమి కనిపించట్లేదు. 

అందుకే, సుమారు 30లక్షల మంది ఐగుప్తు నుండి బయలుదేరితే? బయలు దేరిన వారిలో కేవలం వీరిద్దరు మాత్రమే వాగ్ధాన భూమికి చేరగాలిగారు. 

విశ్వాసం ఎప్పుడూ పరిస్థితులను చూడదు. వాటిని పరిష్కరించగలిగే దేవునివైపు మాత్రమే చూస్తుంది. మనమునూ శోధనలవైపు కాకుండా, శోధనలనుండి తప్పించే దేవునిపై విశ్వాసముంచి సాగిపోదాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
PASTOR.VARA PRASAD (YOUTUBE CHANNEL)

Comments

Popular posts from this blog

Graham stains life story telugu

తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడా? -పెద్ద కుమారుడా?*