Graham stains life story telugu






  • *ఈ రోజు గ్రెహం స్టెయిన్ వారి ఇద్దరు పిల్లలు హతసాక్షులు అయిన రోజు..*

  • 1999 జనవరి 22 అర్థరాత్రి ఒరిస్సా రాష్ట్రంలోని మనోహర్ పూరులో జరిగిన సంఘటన... భారత క్రైస్తవ చరిత్రలో అతి ఘోరమైన సంఘటన.. అమానుషమైన రీతిలో తమ జీవితాలు కాల్చబడి ప్రాణాలు       కోల్పోయి దుర్బలమైన ఆకారముగా మిగిలిన సంఘటన.. ఏమిటా సంఘటన? అసలు ఏమి జరిగింది?.

  • గ్రెహం స్టెయిన్స్ 1941వ సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశంలో పుట్టారు, విలియం ఎలిజబెతులకు రెండవ సంతానంగా స్టెయిన్స్ జన్మించారు, తన 10వ ఏట ఒక సువార్త కూడికలో యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించారు, స్టెయిన్స్ మొదటిసారిగా 1965లో భారతదేశమునకు మిషనరీగా వచ్చారు, ఇవాంజెలికల్ మిషనరీ సొసైటీ ఆఫ్ మయుర్ బంజులో చేరి గిరిజన ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడం ప్రారంభించారు, 1982వ సంవత్సరంలో మయుర్ బంజులో కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం ఒక ఆశ్రమం ప్రారంభించారు, 1983లో భారీపదలో కూడా సేవ చేయడం ప్రారంభించారు, అదే సంవత్సరము గ్లాడీసును పెళ్లి చేసుకున్నారు, వీరికి ముగ్గురు సంతానం వారు ఎస్తేరు, ఫిలిప్ తీమోతి, ఫిలిప్పుది మిషనరీ హృదయము అందరినీ ప్రేమించేవాడు, స్నేహితులు గాయపడిన వేళ నేర్పరివలే కట్లు కట్టి ప్రథమ చికిత్స చేసేవాడు, తిమోతి అయితే 6సంవత్సరాల వయస్సులోనే పాటలు వ్రాసి పాడేవాడు,స్టెయిన్సుకు స్థానికముగా ఉన్న  భాషలను నేర్చుకున్నారు, సాధారణ వస్త్రాలు ధరించేవారు, సైకిల్ మీద తిరుగుతూ సువార్త సేవ చేసేవారు, తన జీవిత కాలంలో ఆయన దేవుని ప్రేమను యితరులకు చెప్పిన దానికంటే చూపించిందే ఎక్కువ. 

  • అలాంటి గ్రహంస్టెయిన్స్  1999 జనవరి 22 అర్దరాత్రి తన కుమారులైన ఫిలిప్ తిమోతిలతో వ్యానులో ఉండగా కొందరు మతోన్మాదులు వ్యానును చుట్టుముట్టారు, గ్రెహం గారిని, ఇద్దరు కుమారులను దారుణంగా కొట్టారు, కత్తులతో పొడిచారు వ్యాను క్రింద ఎండు గడ్డి పెట్టి నిప్పు పెట్టారు. ఎవరు చూడటానికి ఇష్టపడని కుష్టు  వ్యాధిగ్రస్తులను ప్రేమతో ఆదరించిన స్టెయిన్స్ అగ్నిలో కాలిపోయాడు, సమాజమునుండి వెలివేయబడిన కుష్టు రోగులతో హాయిగా ఆడుకున్న ఆ పసి హృదయాలు ఆహుతయ్యాయి, ఈ సంఘటన యావత్ భారతదేశన్నే కలచి వేసింది. 
👉ఈ సంఘటనను ఉద్దేశించి అప్పటి రాష్ట్రపతి ఇలా అన్నారు.. *కాలపరీక్షకు నిలిచి సహనాన్ని సామరస్యాన్ని గండికొట్టే  మరుపురాని భయనక తప్పిదం ఇది, ఈ హత్యలు ప్రపంచము చూసిన ఘోరాతి ఘోరమైన నేరాల జాబితాలో చేర్చవల్సిందే అని అన్నారు.*
☝ అయినా ఇంత దారుణంగా చంపడానికి గ్రెహం స్టెయిన్స్ చేసిన తప్పేంటి, సమాజము నుండి నిర్దాక్షిణ్యంగా త్రోసివేయబడిన ణకుష్టురోగులను తన ఆశ్రమమునకు చేర్చి వారికోసం తన జీవితమును దారపోయడము ఆయన చేసిన తప్పా.. బోగ భాగ్యలను కలిగిన తన దేశమును వదిలి మరొక దేశములోని 34 సంవత్సరముల పాటు కుష్టు రోగులకు సేవ చేయడమా ఆయన చేసిన తప్పు.. కుష్టు రోగులకు స్నేహితునిగా వారి చేత ముద్దుగా దాద అని పిలిపించుకోవడమేన ఆయన చేసిన తప్పు, మేము క్రైస్తవ మనుష్యులను చంపామని గ్రెహం స్టెయిన్స్ గారిని చంపిన వారు అనుకోవచ్చు, కానీ వారు కాల్చింది క్రైస్తవ మనుష్యులను మాత్రమే కాదు మంచితనమును కూడా కాల్చారు, ఏ దేశం కోసమైతే తన జీవితాన్ని ధారపోసడో ఆ దేశ మత చాందసవాదులు అతని చంపేశారు, 
👉ఈ సంఘటనను భట్టి క్రైస్తవులముగా మనం నేర్చుకోవలసింది ఎమిటో తెలుసా త్యాగం, అవును దేవుని కోసం మన ప్రాణాలను త్యాగం చేయ్యాలి, త్యాగం మాత్రమే కాదు ఇంకా మనం నేర్చుకోవలసింది గ్రెహం స్టెయిన్స్ భార్య మరియు తన కూతురు చూపిన ప్రతిస్పందన, తన భర్తను పిల్లలను చంపినవారిని క్షమించమని కోరిన ఆ మంచిమనసు.. ప్రతీ క్రైస్తవుడు కలిగియుండాలి.
👐 గ్రెహం స్టెయన్ మరణము క్రైస్తవ ప్రపంచాన్ని కదిలిస్తే గ్లాడిస్ స్టెయిన్ అతని కుమార్తె చూపిన క్షమాపణ ప్రపంచమునే కదిలించింది.

👉 *యేసు రక్తం సంఘ నిర్మాణానికి పునాది* అయితే.. *యేసు కోసం హతసాక్షులు అయిన వారి రక్తం ఆ నిర్మాణానికి ఇటుకలు వంటివి..* వారు యేసు గురించి తెలియక తమ రెండు చేతులతో మనలను చంపుతున్నారు, కాని యేసు గురించి తెలిసిన మనం మన రెండు చేతులు జోడించి వారి కోసం ప్రార్థన చేద్దాం, మన రెండు పాదములతో కదలి ఈ రెండు పెదవులతో వారికి క్రీస్తు ప్రేమను తెలియజేద్దం, దేవుడు వినగలిగే చెవులు గ్రహించే హృదయము మన సహోదరులకు అనుగ్రహించును గాక. *శ్రమను తట్టుకొని ఓర్చుకొనే మాదిరి క్రైస్తవులకు దయచేయును గాక,* 
*గ్రేహం స్టెయిన్ వంటి మార్గదర్శకులను మనకిచ్చిన దేవదేవునికి మహిమ కలుగునుగాక.* 
సామెతలు10:7
నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకరమగును.

Comments

Post a Comment

Popular posts from this blog

తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడా? -పెద్ద కుమారుడా?*